Home‎ > ‎Events and Celebrations‎ > ‎News‎ > ‎

Dharmaram In Media

 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Original Source: http://www.eenadu.net/archives/archive-2-1-2010/district/districtshow1.asp?dis=medak#3
తెలంగాణ వచ్చే వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లించమంటూ బిల్లుల వసూళ్ళకై గ్రామానికి వచ్చిన ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్బంధించిన ఘటన రామాయంపేట మండలం డి. ధర్మారం గ్రామంలో శుక్రవారం నాడు చోటు చేసుకుంది. ట్రాన్స్‌కో సిబ్బంది కరెంట్‌ బిల్లుల వసూళ్ళ నిమిత్తం ధర్మారం గ్రామానికి చేరుకున్నారు. కాగా బిల్లులు అడుగుతుండగా ఆగ్రహించిన అక్కడి ప్రజలు, గ్రామ సర్పంచ్‌ రంగాగౌడ్‌, ఎంిపీటీసీ సిద్దిరాంరెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బం దిని పంచాయితీ భవనంలో ఉంచి తాళం వేసి నిర్బంధించారు. తెలంగాణ ఏర్పడే వరకు బిల్లులు చెల్లించమని ఈ గ్రామానికి ఎందుకు వచ్చారంటూ వారిని నిలదీ శారు. సుమారు. గంట పాటు అలాగే ఉంచగా సమాచారం తెసుకున్న ఏడీ రామ లింగ, ఏఈ రామదాసును హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. వారి ఎదుట గ్రామస్థులు నిరసన తెలిపారు. తుదకు గ్రామస్థులకు నచ్చచెప్పి సిబ్బందిని విడిపించుకొచ్చారు. ఉదయం కరెంట్‌ వేలలు పొడిగించాలని గ్రామస్థులు తెలపడంతో వారు హామీ ఇచ్చారు. 
Original Source: http://www.suryaa.com/Main/showDistricts.asp?subCat=13&ContentId=51463


 

17 మంది ఎంపిడిఒలకు మెమోలు జడ్‌పి సి.ఇ.ఒ. వాసుదేవులు

కెఎన్‌ఎన్  -   Sat, 5 Dec 2009, IST
Buzz up!

రామాయంపేట, డిసెంబర్‌ 4 (కెఎన్‌ఎన్‌)

గత నెల 30న తెలంగాణ బంద్‌ సందర్భంగా జిల్లాలోని అందరు ఎంపిడిఒలు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికి గైర్హాజరైన 17 మంది ఎంపిడిఒలకు మెమోలు జారీ చేసినట్లు జడ్పీ సి.ఇ.ఓ. వాసుదేవులు తెలిపారు. గురువారం రాత్రి దగ్ధమైన రామాయంపేట మండల పరిషత్‌ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించి పరిశీలించారు. గురువారం విధులకు హాజరు కాని 31 మంది యంపిడిఓల జాబితాను కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు. మంటల్లో కాలిపోయిన రెండు గదులను రికార్డులను అణువు అణువు పరిశీలించారు. సంఘటనపై ఎంపిడిఒను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన గేటు ఒక్కటి వాడుకోవాలని మిగతా వాటికి తాళాలు వేయాలని ఆదేశించారు. నస్కల్‌, డి.ధర్మారం, ఝాన్సిలింగాపూర్‌, రాయిలాపూర్‌, గ్రామాలకు చెందిన ఆడిట్‌ బుక్స్‌ దగ్ధం అయినట్లు వాటితో పాటు మరికొన్ని రికార్డ్స్‌ మంటల్లో కాలిపోయినట్లు వెల్లడించారు. కీలక ఫైళ్ళు భద్రంగా ఉండడంతో ఊపరి పీల్చుకున్నారు. అధికారుల చొరవతో ఫైర్‌ ఇంజన్‌ సకాలంలో వచ్చి మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు. ఆయన వెంట ఎంపిడిఒ అనసూయబాయి, ఎంపిపి గుండాల్లం, స్పెషల్‌ ఆఫీసర్‌ చంద్రమౌళి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌తో పాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Original Source: http://andhraprabha.in/medak/article-54550రాములమ్మకు పరాభవం

హైదరాబాద్ : తెలంగాణ ధూంధాం కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎంపీ విజయశాంతికి రామాయంపేటలోని డి ధర్మారం గ్రామంలో ఘోర పరాభవం ఎదురైంది. ఆమె ప్రసంగాన్ని కొందరు తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. రసమయి బాలకిషన్ పాటలు పాడిన అనంతరం విజయశాంతి మాట్లాడాలని విజయశాంతి ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో అసహనానికి గురైన విజయశాంతి బయట వ్యక్తులు దగ్గర డబ్బులు తీసుకొని గొడవ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణ వాదులు విజయాశాంతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. దీంతో ఆమె సభా ప్రాంగణం నుండి దిగి వెళ్లిపోయారు.

విజయశాంతి ప్రసంగాన్నిఅడ్డుకున్న ప్రజలు

Date Updated: 1/21/2010 8:12:54 PM   
 విజయశాంతికి చుక్కెదురైంది. గ్రామంలో నిర్వహించిన తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో విజయశాంతి ప్రసంగాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారుఎంపీ విజయశాంతి కళాకారుడు రసమయి బాలకృష్ణల మధ్య వాగ్వాదం జరిగింది. విజయశాంతి గో బ్యాక్‌ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు విజయశాంతి సభ నుంచి వెనుదిరిగింది. ధూంధాం కార్యక్రమానికి తెలంగాణ కళాకారుడు రసమయి బాలకృష్ణ బృందం ఎంపీ విజయశాంతి హాజరయ్యారు. మొదట విజయశాంతి సభనుద్దేశించి మాట్లాడుతోంది. 5 నిమిషాలలోపే ధూంధాం వెనుక వైపు నుంచి పెద్ద ఎత్తున కొందరు జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఆమె మాటలకు అంతరాయం కల్గించారు. కొద్దిసేపు ఆమె ఎంత వారించిన వారు వినలేదు. దీంతో ఆమె ఆగ్రహించి కొందరు డబ్బులిచ్చే ఇలాంటి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఒకరికొకరు విమర్శించుకోవడం మూలంగానే మనకు ఈ గతి పట్టిందన్నారు. అనంతరం ప్రసంగాన్ని ముగించి వెనుదిరిగి వెళ్లిపోయారు. అంతలోనే రసమయి బాలకృష్ణ మైకు చేతపట్టి రెండు గంటలు ఓపిక పట్టని ఈ నాయకులు తెలంగాణ ఎలా తెస్తారని ఆరోపించారు. ఇలాంటి వారు స్టేజీలపైకి వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోవడమేనని విమర్శించారు. దమ్ముంటే ధూంధాం కార్యక్రమం అయిపోయేవరకు స్టేజిపైనే ఉండాలని లేదంటే కార్యక్రమాలకు హాజరు కావద్దన్నారు. కారు ఎక్కుతున్న విజయశాంతి రసమయి మాటలు విని వెంబడే వెనుదిరిగి స్టేజి పైకి వచ్చింది. దీంతో ఇరువురూ ప్రజల సమక్షంలోనే స్టేజిపైనే వాగ్వాదానికి దిగారు. దీంతో విజయశాంతి గో బ్యాక్‌ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక సీఐ విజయ్‌కుమార్‌ ఎస్‌ఐ వెంకటరామయ్యలు ఆమెకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు ఉద్రిక్తతను చల్లార్చారు. కాగా విజయశాంతి తిరిగి సంజాయిషి ఇస్తుండగా రసమయితో పాటు ప్రజలు అడ్డుతగిలారు. దీంతో ఆమె వెనుతిరిగి పోక తప్పలేదు.

మెదక్‌ జిల్లాలోని రామాయంపేట మండలం ధర్మారం గ్రమాంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ